Manidweepa Varnana Telugu Lyrics | Manidweepa Varnana Benefits

Benefits of chanting manidweepa varnana mantra – Reading, hearing, or imagining about Manidweepa and the Glories of Devi Bhagavati will provide peace of mind, contentment, new springs of hope, purpose, and direction of life, especially when new projects or actions are launched as also when apprehensions, obstacles, diseases, tragedies, or death are contemplated, so said Maharshi Veda Vyas.

Manidweepa Varnana Lyrics in Telugu

మహశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది || 1

సుగంధ పరిమళ పు ష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనోసుఖాలు మణీ ద్వీపానికి మహనిధులు || 2

లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు మణీ ద్వీపానికి మహనిధులు || 3

పారిజాత వన సౌగంథాలు సురాధినాధుల సత్పంగాలు
గంధర్వాదుల గాన స్వరాలు మణి ద్వీపానికి మహనిధులు || 4

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం || 5

పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు
మధుర మధురమగు చందన సుధలు మణి ద్వీపానికి మహనిధులు || 6

అరువది నాలుగు కళామతల్టులు వరాలనొసగే పదారుశక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 7

అష్టసిద్దులు నవనవ నిధులు అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలు మణి ద్వీపానికి మహానిధులు || 8

కోటి సూర్యులు ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు మణి ద్వీపానికి మహానిధులు ॥భువ॥ 9

కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురప్రాలు
ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు || 10

పంచామ్మతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్తీపానికి మహానిధులు || 11

ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కొటలు వైఢూర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు || 12

సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు ||భువ|| 13

మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు || 14

కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు || 15

భక్తిజ్ఞాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహలు మణిద్వీపానికి మహానిధులు || 16

కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
అరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధుల ||భువ|| 17

మంత్రిణి దండిని శక్తిసేవలు కాళికరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 18

సువర్ణరజిత సుందరగిరులు ఆనంతదేవి పరిచారికలు
గోమేధికముణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు || 19

సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు || 20

మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు
సృష్టిస్టితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు ||భవ|| 21

కోటీ ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 22

దివ్య ఫలములు దివ్యా స్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 23

శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణీ నిర్మితమగు మండపాలు మణిద్విపానికి మహానిధులు || 24

పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు
సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు || 25

చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు
వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు || 26

దుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్దాలు మణిద్వీపానికి మహానిధులు || 27

పదునాల్గు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మగణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్దానం || 28

చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన |
మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో ||భువ|| 29

మణిగణ ఖచిత అభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి ద్వీపములో || 30

పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్యరి దీవిస్తుంది ||2|| 31

నుతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు ||2|| 32

శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్విప వర్షన చదివినచోట
తిష్ట వేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చకొనుటకై ||2|| 33

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్విపం
దేవదేవుల నివాసము అదియే కైవల్యం ॥ భుహ ||

11 Mukhi Rudraksha Benefits, Types, Power, and Significance 9 Mukhi Rudraksha Benefits, Types, Power, and Significance 7 Mukhi Rudraksha Benefits, Types, Power, and Significance 4 Mukhi Rudraksha Benefits, Types, Power, and Significance Moon Square Pluto Meaning, Natal, Synastry, Men and Women Moon Conjunct Pluto Meaning, Natal, Synastry, Transit, Men and Women Neptune Sextile Pluto Meaning, Natal, Synastry, Transit, Relationship Etc New Moon in Aries 2023 Rituals and impact on Other Zodiac Fumio Kishida Zodiac Sign, Horoscope, Birth Chart, Kundali and Career Zodiac signs that are more inclined to get married again!